Header Banner

స్టార్ హీరో అజిత్ కుమార్ కు ప్రమాదం! పల్టీలు కొట్టిన రేస్ కార్! కానీ ఈసారి..!

  Sat Apr 19, 2025 15:45        Others

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ మరోసారి రేసింగ్ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. బెల్జియంలో ఇటీవల నిర్వహించిన "సర్క్యూట్ డి స్పా-ఫ్రాంకోరాఛాంప్స్" అనే ఇంటర్నేషనల్ రేసింగ్ ఈవెంట్‌లో పాల్గొన్న అజిత్, ఆ సమయంలో జరిగిన ప్రమాదం నుంచి అద్భుతంగా బయటపడ్డారు. రేసింగ్ ట్రాక్‌పై అజిత్ కారు నియంత్రణ కోల్పోయి ఒక్కసారిగా ట్రాక్ బయటకు దూసుకెళ్లింది. అయితే ఈ ఘటనలో ఆయన సురక్షితంగా బయటపడడంతో అందరూ ఊపిరిపీల్చుకుంటున్నారు. అజిత్ కార్ రేసింగ్ లో ప్రమాదానికి గురి కావడం ఇది మూడోసారి.



వరుస ప్రమాదాలు..

'అజిత్‌ కుమార్ రేసింగ్‌' పేరుతో ఇటీవలే అజిత్ తన రేసింగ్‌ టీమ్‌ను ప్రకటించాడు. జనవరిలో జరిగిన '24హెచ్‌ దుబాయ్‌' కారు రేసింగ్‌లో అజిత్ టీమ్ మూడో స్థానంలో నిలిచింది. కానీ ఈ రేసింగ్ లోనే అజిత్ వరుసగా ప్రమాదాలకు గురికావడం అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది. దుబాయ్‌లో జరిగిన గ్రాండ్ ప్రీ రేస్ కోసం ప్రాక్టీస్ చేస్తుండగా అజిత్ కారు గోడను బలంగా ఢీకొట్టింది. ఆ తర్వాత స్పెయిన్‌లో జరిగిన మరో రేస్‌లో పక్కనే వస్తున్న మరో కారును తప్పించబోయి పల్టీలు కొట్టింది. ఇప్పుడు జరిగిన ఘటనతో మూడోసారి కూడా ప్రమాదం జరిగినట్టు అయ్యింది. ఈ ప్రమాదాల్లో అజిత్ కు గాయాలు కాకపోవడం ఊరట నిస్తోంది.


ఇక ఇప్పుడు మూడో సారి జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోను ఆయన టీమ్ స్వయంగా ఇన్ స్టాలో షేర్ చేసింది. అయితే రేసుల్లో ఇలాంటి ప్రమాదాలు సాధారణమేనని.. ఎవరూ కంగారు పడొద్దని అజిత్ సందేశం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక రీసెంట్ గానే అజిత్ నటించిన 'గుడ్ బ్యాడ్ అగ్లీ' మూవీ రిలీజై హిట్ టాక్ తెచ్చుకుంది. అధిక్‌ రవిచంద్రన్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటించింది. రూ.200 కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ మూవీ అజిత్‌ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచింది. సినిమాలు ఒకవైపు, రేసింగ్ మరోవైపు... అజిత్ తన ఇష్టాలను, ప్యాషన్‌ను బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారని అంటున్నారు.


ఇది కూడా చదవండిజగన్ గుండెల్లో గుబులు.. వలసబాటలో వైఎస్సార్సీపీ మాజీ మంత్రి రోజా! ఆ పార్టీలోకి అడుగు..

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ బీజేపీ కొత్త సారథి ఎవరు..? రేసులో 'ఆ నలుగురు' నేతలు.. అధిష్టానం ఆశీస్సులు ఎవరికో!

 

వైసీపీకి మరో భారీ షాక్.. విశాఖ మేయర్ పీఠం కూటమి కైవసం! ఒక్కొక్కరుగా పార్టీని వీడటంతో..

 

గుట్టు రట్టు.. జగన్ నే ఎదిరించిన చరిత్ర ప్రస్తుత రఘురామకృష్ణరాజుదే.! నన్ను దూరం పెట్టడానికి కారణం ఇదే.!

 

జగన్ మురికి పాలనకు చెక్.. ప్రతి ఇంటికి స్వచ్ఛతతాగునీరు కూటమి లక్ష్యం! స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో మంత్రి!

 

తిరుపతి జిల్లాలో రైలు ప్రమాదం.. గేదెల్ని ఢీకొట్టిపట్టాలు తప్పిన గూడ్స్ రైలు.!

 

బీజేపీ నుంచి టీడీపీకి గవర్నర్ ఆఫర్.. చంద్రబాబు ఎంపికపై ఉత్కంఠ! ఆ ఇద్దరి పేర్లు లిస్ట్ లో..!

 

అమరావతిలో అభివృద్ధికి శ్రీకారం.. మోదీ పర్యటనకి గ్రాండ్ వెల్‌కమ్! రైతులు పూలతో ప్రత్యేక స్వాగతం!

        

ప్రపంచంలోనే అతిపెద్ద విమానాశ్రయం ప్రారంభానికి సిద్ధం! 57 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం.. సమాంతర రన్వేలు!

 

మరో వివాదంలో దువ్వాడ శ్రీనివాస్! డాక్టరేట్ పెద్ద దుమారమే.. నెట్టింట చర్చ!

 

బ్రేకింగ్ న్యూస్! సిట్ విచారణకు సాయిరెడ్డి! వెలుగులోకి వస్తున్న కీలక సమాచారం!

 

వైసీపీకి ఊహించని షాక్! పాలేటి కృష్ణవేణికి 14 రోజుల రిమాండ్!

 

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తెలుగు విద్యార్థిని దుర్మరణం! మృతదేహ రవాణకు కేంద్ర మంత్రి కృషి!

 

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్! కేంద్రం నుండి గ్రీన్ సిగ్నల్! ఆ జిల్లాలో ఎయిర్ పోర్ట్ నిర్మాణ సన్నాహాలు!

 

నేడు (18/4) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #andhrapradesh #AjithKumar #AjithRacing #AjithInAction #CarAccidentEscape #RacingIncident